హనుమంతుని జన్మస్థలం - జపాలి తీర్ధము, తిరుమల అంజనాదేవి, హనుమంతునికి జన్మనిచ్చిన ప్రదేశాన్ని , వెంకటాద్రి ని , అంజనాద్రి అనే పేరుతో పిలుస్తారు.
కేసరి, అంజనాదేవి అనే దంపతులలు సంతానం కలుగక పోవడం తో మాతంగి మహర్షి దగ్గరకు వెళ్లి, సుపుత్రయోగం, పున్నమ నరక విముక్తికి మార్గం చెప్పాలని ప్రార్ధిస్తుంది.
బాల హనుమాన్, అంజనా దేవి, దేవాలయము, ఆకాశ గంగ, తిరుమల
అంజనాదేవి, "ఆకాశ గంగ తీర్థంలో, తపస్సు": పుత్ర సంతానము కోసము, మాతంగి మహర్షి , సలహా మేరకు , తిరుమల చేరుకున్న అంజనాదేవి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి, అశ్వద వృక్షాని ప్రదక్షిణ చేసి, అక్కడ నుంచి ఒక క్రోస దూరంలో ఉన్న ఆకాశ గంగ తీర్థం చేరుకుంది , ముందుగా బక్ష బోజ్యదులన్ని వదిలిపెట్టి దేహాని కటివలె మలుచుకొని తపస్సు ఆచరిస్తుంది.
హనుమాన్ జన్మస్థలం - జపాలి, తిరుమల
హనుమాన్ జననము- జపాలి తీర్ధము, తిరుమల : తపస్సును మెచ్చిన వాయు దేవుడు, అంజనాదేవి చేతిలో ఒక ఫలాని ఇస్తారు. ఆ ఫలం ద్వార అంజనాదేవి సుపుత్ర యోగం కలిగి, తొమ్మిది మాసాలు మోసి హనుమాన్ కు ఆ ఆకాశ గంగ తీర్థం సమీపంలోని జాపాలిలో శ్రవణ మాసంలో, శ్రీ హరివాసంలో జన్మనిస్తుంది.
ఆంజనేయుని జన్మదిన ఆధారములు :
చిరంజీవి హనుమ పుట్టిన స్థలం , వేంకటాచలనికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుని బృహత్‌సంహిత గ్రంథాల ప్రకారం , అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు.
అంజనాద్రి పర్వతం
తిరుమల కొండ- యుగయుగాల పేర్లు
* కృతయుగం- వృషబాద్రి ,
* త్రేతాయుగం- అంజనాద్రి
* ద్వాపర యుగం- శేషాచలం ,
* కలియుగం- వెంకటాచలం, పిలువబడుతోందని పురాణాల్లో పేర్కొన్నాయి .
=====================================
హనుమాన్ మందిరము, జపాలి తీర్ధము, తిరుమల
సీతమ్మ ధార, జపాలి తీర్ధము
సీతమ్మ ధార, జపాలి తీర్ధము, తిరుమల : సీతాదేవి, జపాలి తీర్ధమునకు వచ్చినపుడు, ఈ తీర్ధము లో , స్నానము చేశారు, అందువలన , ఆ తీర్ధమునకు , సీతమ్మ ధార, అని పేరువచ్చినది ,
=========