తిరుపతి గంగమ్మ తల్లి
ముఖ్యమంత్రి- తిరుపతి గంగమ్మ తల్లి దర్శనము&
శ్రీవారికి , తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు- పట్టు వస్త్రాలు సమర్పణ
2022 సంవత్సరము నుండి, ఆంధ్ర దేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకున్న తరువాత , తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు , ధ్వజారోహణం రోజున( మొదటి రోజు), శ్రీవారికి, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాత, వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, తిరుమల వెళ్లేవారు.
గంగమ్మ తల్లి జననము : ఈ పాలెగాడు అంతమొందించి, స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించింది.
పాలెగాడు: తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో, ఒక పాలెగాడు తన రాజ్యంలోని , కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడు.
గంగమ్మ తల్లి - పాలెగాడు సంహరణ: యుక్తవయసులో ఉన్న , గంగమ్మను , పాలెగాడు బలాత్కరించబోయాడు . దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది . తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కుంది.
పాలెగాడుని, గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగో రోజు గంగమ్మ-దొర వేషం వేసింది. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించింది. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ . ఆ గంగమ్మ తల్లి , తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ప్రజలు ఈ జాతర జరుపుకుంటారు .

తిరుపతి గంగమ్మ జాతర
తిరుపతి గ్రామదేవత, శ్రీ తిరుపతి గంగమ్మ తల్లికి, ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే, ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అధికారికంగా, జరుపుతుంది.
గంగమ్మ తల్లి, తిరుమల వేంకటేశుని చెల్లెలు- సారె : పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాత, వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, తిరుమల వెళ్లేవారు. గంగమ్మ తల్లి తిరుమల వేంకటేశుని చెల్లెలని ప్రతీతి. అందువలన, ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగో రోజు శ్రీవారి ప్రతినిధులు అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలు శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలు మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారె అందజేస్తారు.
No comments:
Post a Comment