విమాన వేంకటేశ్వరస్వామి, తిరుమల
ఆనందనిలయం మీద, ఉత్తర దిశగా పైన ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహం, విమాన వేంకటేశ్వరస్వామి గా పిలుస్తారు .
వ్యాసరాయలు,
శ్రీవారి అర్చకత్వాన్ని
మధ్వ సాధువు, గురువు: విజయనగర చక్రవర్తిగా నరసింహరాయలు, పరిపాలన కాలములో "వ్యాసరాయలు" పన్నెండేళ్ళ పాటు
అర్చకుడి గా, నిర్వహించాడు. వ్యాసరాయలు ఆనందనిలయం విమానంపై ఉన్న
వేంకటేశ్వరుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠచేసి , దాన్నే విమాన వేంకటేశ్వరుడిగా ప్రచారానికి
తీసుకువచ్చాడు.
తొండమాన్
చక్రవర్తి : ఈ విమాన
వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని
"వేంకటాచలమాహాత్మ్యం" ద్వారా తెలుస్తోంది.
పూర్వ విమాన ప్రదక్షిణం ఆచారము: పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ
ముందుగా "విమాన వేంకటేశ్వరస్వామి"వారిని దర్శించిన తర్వాతే ఆనంద
నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట.పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ
మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించడం
జరుగుతూ ఉంది.
విశ్వాసం: ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాణ్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం. దర్శనం కాకుండా వెళ్ళిపోవాల్సి వచ్చినవారు ,ఆ రోజుల్లో విమాన వేంకటేశ్వరుడిని దర్శించి తిరిగివెళ్ళేవారు. ఒకవేళ ఆనందనిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వేంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట.
విమాన
ప్రదక్షిణం: వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు
ప్రదక్షిణంగా వెళ్తూ, విమాన
వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ.
ఫలితము: ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలగుతాయి అంతేకాదు సర్వశుభాలు కలుగుతాయట.
No comments:
Post a Comment