Wednesday, May 3, 2023

Matrusri Tarigonda Vemgamamba

                                                      మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబ

                  మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబ:  తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలు, తెలుగు  కవయిత్రి. సాంఘిక దురాచారాలను ఎదిరించిన ధీరవనిత. చిన్నతనం నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సర్వస్వం గా భావించి మహా భక్తురాలు. తిరుమలలో స్వామివారి సన్నిధిలో విచ్చేసే భక్తులకు తొలిసారిగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వితరణ శీలి.


          జననం  (20 .ఏప్రిల్. 1730): వెంగమాంబ చిత్తూరు జిల్లా,  తరిగొండ గ్రామం లో  , 20 .ఏప్రిల్. 1730   జన్మించారు. బాల్యములో, భక్తి పాటలు కూర్చి మధురంగా గానం చేసింది. తిరుమల, తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేసింది.  


       
 నిత్యాన్నదానానికి వెంగమాంబ శ్రీకారం:   క్రీ.శ 1812–15 మధ్య కాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది. నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చేది. టీటీడీ వారు నేటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొండపై వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న నిత్యాన్నదాన సత్రానికి శ్రీ వెంగమాంబ పేరు  పెట్టారు.


          ముత్యాలహారతి– వేంకటేశ్వరునికి జోలపాట: వెంకటేశ్వర స్వామి , వెంగమాంబ ఉండడానికి నివాసం, ఇతర సౌకర్యాలతోపాటు ఆలయంలో ఉదయం అన్నమయ్య మేలుకొలుపు తరువాత రాత్రి స్వామివారి జోలపాట ముత్యాల హారతి ఇచ్చే భాగ్యాన్ని వెంగమాంబ కల్పించారు.


  రచనలు:  వేంకటాచల మాహాత్మ్యము, ద్విపద భాగవతం వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించారు.

                  జీవ సమాధి(21.ఆగస్టు .1817),  తిరుమల: 1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమి నాడు తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది.





=============

 శ్రీవారు, వెంగమాంబ నివాసానికి వేంచేయుట- మే.13 .2023

శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన భవనం


No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...