Friday, February 19, 2021

Vara Swamy Temple

                     శ్రీ వరాహస్వామి ఆలయం                

ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనది. శ్రీ వరాహస్వామి ఆలయంనుభూ వరాహస్వామి ఆలయంగావేంకటాచలం వరాహ క్షేత్రంగా పిలుస్తారు .

సప్తగిరులలో, మొట్టమొదటిసారి వెలసిన స్వామి,  శ్రీ  వరాహ స్వామి. అందువలన, తిరుమలను ఆది   వరాహ స్వామి  క్షేత్రముగా  పిలుస్తారు. 

 తిరుమల క్షేత్ర సాంప్రదాయము :   శ్రీ వరాహ స్వామి వారిని ,  తొలుత దర్శించున్నకే , భక్తులు  శ్రీ వెంకటేశ్వర స్వామిని, దర్శించుకోవడము , క్షేత్ర సాంప్రదాయము.

శ్రీవారి పుష్కరిణికి,  వాయువ్య  మూలలో, తూర్పు ముఖంగా ,  శ్రీ వరాహ స్వామి వారు , భూదేవితో  కలసి అనుగ్రహస్తున్నారు. 

 వరాహస్వామితో వేంకటేశ్వరుడు  రాగి రేకు మీద ఒప్పందం:   

కలియుగ ప్రారంభములో , శ్రీవెంకటేశ్వర స్వామి  వైకుంఠము నుండి వచ్చి,  

 తాను  ఉండటానికి వంద అడుగుల స్థలాన్ని , దానముగా ఇవ్వాలని ,   శ్రీ వరాహ స్వామి ని అడిగారు. 

అందుకు, సమ్మతించిన   శ్రీ వరాహ స్వామి, ప్రతిఫలంగా, వెంకటేశ్వర స్వామి ,   శ్రీ వరాహ స్వామి కి, "ప్రధమ దర్శనము , ప్రధా పూజ, ప్రధమ అర్చన,  ప్రధమ  నైవేద్యము , ప్రధమ  నివేదన జరిగేట్లు,  అనే వప్పందముతో , వెంకటేశ్వర స్వామి దానపత్రాన్ని రాగిరేకు పైన రాసిచ్చి , వంద అడుగుల స్థలాన్ని దానముగా పొందారు. ఆనాటి, ఒప్పందం ప్రకారము,  నేటికీ తిరుమలలో,   శ్రీ వరాహ స్వామి కి , తోలి పూజ , నివేదనలు జరుగుతున్నాయి. 

ఆ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు.

యాత్రా ఫలం : ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని , దర్శించుకుంటే,   యాత్రా ఫలం  దక్కుతుంది. 

 స్థలము : శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది.


No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...