Monday, April 7, 2025

తరిగొండ వెంగమాంబ జయంతి - 11. మే. 2025


                                                      మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ


                            తరిగొండ  వెంగమాంబ "జీవ సమాది- 21.ఆగస్టు .1817, తిరుమల" - 

    శ్రీవారి  ఏకాంత సేవ సమయములోవెంగమాంబ సూక్ష్మ రూపంలో, జీవ సమాది నుండి బయలుదేరి , ముత్యాల హారతికి హాజరు అవుతారు.

            మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబ( 20 .ఏప్రిల్. 1730-  జీవ సమాధి -21.ఆగస్టు .1817,  తిరుమల ):  తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలు, తెలుగు  కవయిత్రి. సాంఘిక దురాచారాలను ఎదిరించిన ధీరవనిత. చిన్నతనం నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సర్వస్వం గా భావించి మహా భక్తురాలు. తిరుమలలో స్వామివారి సన్నిధిలో విచ్చేసే భక్తులకు తొలిసారిగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వితరణ శీలి.

                          వెంగమాంబ రచనలు:  శ్రీ వేంకటాచల  మహత్యము 


* మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబకు, వెంకటేశ్వర స్వామి వారు రెండు వరాలు ఇచ్చారు *
  

1.  ముత్యాల హారతి:  శ్తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్య కైంకర్యాన్ని , ప్రవేశ పెడతానని, చెప్పారు.

   తరిగొండ వెంగమాంబ  మండపము (నివాసము ), తిరుమల 
      శ్రీవారు, వెంగమాంబ  నివాసానికి  వేంచేయుట

2.  శ్రీవారు, వెంగమాంబ నివాసానికి  వేంచేయుట: వెంగమాంబ జన్మదినం తరువాత , 10 వ  రోజు ,  ఆమె నివాసానికి వస్తానని వరము, ఇచ్చారు. 


No comments:

Post a Comment

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య

                                                వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య ------------  వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి వాగ్గేయక...