Tuesday, February 23, 2021

Ananth Alwar

  

                                          అనంత ఆళ్వార్     

                 ఆళ్వారులలో ప్రముఖుడుశ్రీ వైష్ణవ భక్తుడు,  అనంత ఆళ్వార్. అనంత ఆళ్వార్,  ఆదిశేషుని  రూపము. రామానుజాచార్యుని అభిమతానుసారమేశిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి,  స్వామివారి పుష్ప కైంకర్యము మొదలుపెట్టారు.                                      

            అనంత ఆళ్వార్గునపం:  అనంత ఆళ్వార్నిండు గర్భిణియైన తన భార్యతో కూడి స్వామివారి ఆలయం చెంత ఒక పూతోటను నిర్మిస్తుండగా,  బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను కాదన్నాతన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యాన వన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంత ఆళ్వార్ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు.నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది.                                                      

                                                                 

       మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణంకర్పూరపు ముద్దను అంటించడం: మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడైనాడు.                                                             

            అనంత ఆళ్వార్ దివ్య గాథ లుస్పురింపచేయటం: శ్రీవారి ఆలయంలో స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంత ఆళ్వార్ దివ్య గాథను స్పురింపచేస్తుంది. నేటికీ మహాద్వారం చెంత అనంత ఆళ్వార్స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది.

       అనంత ఆళ్వార్,  అవతారోత్సవంఫిబ్రవరి 24 : ప్రతి సంవత్సరము ,  అవతారోత్సవం ఫివ్రబరి 24న ఆయన వంశీకులు తిరుమలలోని పురుశైవారి తోటలో  ఘనంగా నిర్వహింస్తారు.  అనంత ఆళ్వార్,  వంశీకులు తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా పరిగణించడం ఆనవాయితీ. ఆరోజు దేశ వ్యాప్తంగా స్థిరపడివున్న అనంత ఆళ్వార్ వంశీయులు తిరుమలలోని  అనంతాళ్వారు తోట(పురశైవారి తోటలో) కలసి ప్రత్యేక పూజలుదివ్యప్రబంధ పాశుర పారాయణంఆధ్యాత్మిక ప్రవచానాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు 500 వందలకు పైగా అనంతాళ్వారు వంశీయులు ఈ అవతారోత్సవంలో పాల్గొంటారు.

No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...