Saturday, November 5, 2022

Golla Mandapam, Tirumala

  

                                     గొల్ల మండపంతిరుమల

                  గొల్ల కులానికి చెందిన ,  గొల్ల పడుచు తిరుమలలో పాలు అమ్ముకొనివచ్చిన ఆదాయంతో,  తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో మండపాన్ని నిర్మించింది. ఆ మండపాన్ని, "గొల్లమండపం" అంటారు.

    తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో గొల్ల పడుచుఅత్తగారు  పాలూపెరుగూ ఇచ్చికొండకు పోయి అమ్ముకొని రమ్మనిపంపేది.

గొల్ల పడుచుతిరుమల శిల్పులు: గొల్ల పడుచుతిరుమల శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది. ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగాఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా బెజవాడ కనక దుర్గమ్మ పంపిన సొమ్మంతా అయ్యిపోయింది అన్నారు .

         గొల్ల మండపం:  అప్పుడు, ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బుతో కడితే నిలుస్తుంది కానీమా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూపెరుగూ అమ్మాను. ఆ డబ్బును,  మూడు కొండ రాళ్ళనుఒక దగ్గరకు చేర్చి ఆమధ్యలో దాసుకొన్నాను. ఒక మండపము  డబ్బుతో కట్టండని చెప్పి,  ఆ డబ్బు వారికిచ్చింది . అలా కట్టినదే తిరుమలేశుని ఆలయము ముందున్న నాలుగు స్థంబాల మండపము, "గొల్ల మండపం".                                               

                           Golla Mandapam, Tirumala

  Women belonging to Golla community were supplying milk to the temple and for devotees, with her own earnings; she built the “Golla Mandapam”.

No comments:

Post a Comment

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...