Tuesday, April 8, 2025

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు- 12.మే .2025

 

 
                                                            తాళ్ళపాక అన్నమయ్య

                వాగ్గేయకారుడు,  పదకవితా  పితామహుడు , కలియుగ దైవం  వెంకటేశ్వర స్వామి , పరమ భక్తుడు .

             పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి జయంతి ఉత్సవాలు మే  6 నుండి 12వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని  అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయి. 

                                                 తిరుపతి- అన్నమాచార్య కళామందిరం

     సాహితీ సదస్సులు:  ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు

           తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మే  7 నుండి 12వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు నిర్వ‌హిస్తారు. 

      సంగీత, నృత్య కార్యక్రమాలు: ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో

           మే 6 నుండి 12వ తేదీ వ‌రకు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో ప్రముఖ కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
             తాళ్లపాక-  ధ్యాన‌మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం(రాజంపేట బైపాస్ లో)

   శ్రీవారి కల్యాణం: ధ్యాన‌మందిరం వ‌ద్ద , మే 6, ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణం నిర్వ‌హిస్తారు.
   
           భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు:  మే 6 నుండి 12వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. 
=============




        


No comments:

Post a Comment

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య

                                                వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య ------------  వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి వాగ్గేయక...