గొల్ల మండపం, తిరుమల
గొల్ల కులానికి చెందిన , గొల్ల పడుచు తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో, తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో మండపాన్ని నిర్మించింది. ఆ మండపాన్ని, "గొల్లమండపం" అంటారు.
తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో గొల్ల పడుచు, అత్తగారు పాలూ, పెరుగూ ఇచ్చి, కొండకు పోయి అమ్ముకొని రమ్మని, పంపేది.
గొల్ల పడుచు, తిరుమల శిల్పులు: గొల్ల పడుచు, తిరుమల శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది. ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా, ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా , బెజవాడ కనక దుర్గమ్మ పంపిన సొమ్మంతా అయ్యిపోయింది అన్నారు .
గొల్ల మండపం: అప్పుడు, ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది ? నా డబ్బుతో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను. ఆ డబ్బును, మూడు కొండ రాళ్ళను, ఒక దగ్గరకు చేర్చి ఆమధ్యలో దాసుకొన్నాను. ఒక మండపము, ఆ డబ్బుతో కట్టండని చెప్పి, ఆ డబ్బు వారికిచ్చింది . అలా కట్టినదే తిరుమలేశుని ఆలయము ముందున్న, నాలుగు స్థంబాల మండపము, "గొల్ల మండపం".
Golla Mandapam, Tirumala
Women belonging to Golla community were supplying milk to the temple and for devotees, with her own earnings; she built the “Golla Mandapam”.