Saturday, April 27, 2024

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "


                                   తిరుమల వివాహ కానుక - ఇది పూర్తిగా ఉచితం

            మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది.

              తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.

======================

To,

Sri Lord Venkateswara swamy,

The Executive Officer

TTD Administrative Building

K.T.Road

Tirupati

517501

Tirumala Tirupati Devasthanams (TTD)

Sunday, April 14, 2024

శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, అలిపిరి, తిరుపతి

                                                                  

శ్రీనివాస దివ్యానుగ్రహ  విశేష హోమం 

                                         సప్త గో ప్రదక్షిణ మందిరం, అలిపిరి, తిరుపతి

               శ్రీనివాస దివ్యానుగ్రహ  విశేష హోమం: వైఖాన‌స ఆగ‌మ శాస్త్రంలో చెప్పబడిన విధంగా పుణ్యాహవ‌చనం నుండి పూర్ణాహుతి వరకు నిర్వ‌హించు వివిధ క్ర‌తువుల‌ను, నిర్వహిస్తారు . సనాతన సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత  ఉంది . శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్నిరెండు గంటల పాటు నిర్వహిస్తార‌న్నారు. 

        శ్రీనివాస దివ్యానుగ్రహ  "విశేష హోమం ఫలితము":  ఈ విశేష హోమంలో,  భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రము . భక్తులు, తమ  సంక‌ల్పం చెప్పుకుని, హోమం లో పాల్గొంటే , తమ కోరికలు నెరవేరుతాయి. 

               సామాన్య భ‌క్తులు హోమం, యాగం నిర్వ‌హించ‌డం చాలా ఖ‌ర్చుతో కూడుకుంది . కావున భ‌క్తుల‌ కోరిక మేర‌కు శ్రీవారి పాదాల వ‌ద్ద‌ త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం,  సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేశారు.

       ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో,  ప్రతిరోజు  ఈ హోమం తిరుమల తిరుపతి దేవస్థానం వారు, నిర్వహిస్తున్నారు .

శ్రీనివాస దివ్యానుగ్రహ  విశేష హోమం 

                                            సప్త గో ప్రదక్షిణ మందిరం, అలిపిరి, తిరుపతి

  •   ప్రవేశ చీటీ(టిక్కెట్టు):  ఉదయము 6 .30, ప్రతిరోజు 
  •   సమయము ( విశేష హోమం):  ఉదయము 9 - 11 గంటల వరకు 
  •   ప్రవేశ రుసుము: 1000 రూపాయలు , ఇద్దరికీ 
                వేదిక :   సప్త గో ప్రదక్షిణ మందిరం, అలిపిరి, తిరుపతి .

                                                 
    

                                                   శ్రీవారి దర్శనము , తిరుమల  

  •  శ్రీవారి దర్శన సమయము: మధ్యాహ్నం, ౩ గంటలకు, 
  •  రుసుము : ఒక్కొక్కరికి,  300 రూపాయలు. 
  •  దర్శన మార్గము: వైకుంఠం కాంప్లెక్స్ - 2

గమనిక: శ్రీవారి  ప్రత్యేక దర్శనం టికెట్ పొందుటకు, హోమము కు, హాజరైన టికెట్ చూపించాలి. 

Thursday, April 4, 2024

వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య వర్ధంతి

                                   

                                         వాగ్గేయకారుడు  తాళ్ళపాక అన్నమయ్య వర్ధంతి 

                                                   కలియుగ దైవం  వెంకటేశ్వర స్వామి , పరమ భక్తుడు  తాళ్ళపాక అన్నమయ్య వర్ధంతి కార్యక్రమాలు , ఏప్రిల్.5 .2024, తాళ్ళపాక గ్రామము లో,  ప్రారంభం అవుతాయి, మూడు రోజులు జరుగుతాయి. 

      తిరుమల తిరుపతి దేవస్థానము , స్థానిక కళాకారులతో సప్తగిరి సంకీర్తనలు , గోష్టిగానము, హరికథ , సంగీత సభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధ్యానమందిరము , 108  అడుగుల విగ్రహము వద్ద, హరికథ, సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. 




నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...