సప్త గో ప్రదక్షిణ మందిరం, అలిపిరి, తిరుపతి
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం: వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పబడిన విధంగా పుణ్యాహవచనం నుండి పూర్ణాహుతి వరకు నిర్వహించు వివిధ క్రతువులను, నిర్వహిస్తారు . సనాతన సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత ఉంది . శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్నిరెండు గంటల పాటు నిర్వహిస్తారన్నారు.
శ్రీనివాస దివ్యానుగ్రహ "విశేష హోమం ఫలితము": ఈ విశేష హోమంలో, భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రము . భక్తులు, తమ సంకల్పం చెప్పుకుని, హోమం లో పాల్గొంటే , తమ కోరికలు నెరవేరుతాయి.
సామాన్య భక్తులు హోమం, యాగం నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకుంది . కావున భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం, సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ప్రతిరోజు ఈ హోమం తిరుమల తిరుపతి దేవస్థానం వారు, నిర్వహిస్తున్నారు .
సప్త గో ప్రదక్షిణ మందిరం, అలిపిరి, తిరుపతి
- ప్రవేశ చీటీ(టిక్కెట్టు): ఉదయము 6 .30, ప్రతిరోజు
- సమయము ( విశేష హోమం): ఉదయము 9 - 11 గంటల వరకు
- ప్రవేశ రుసుము: 1000 రూపాయలు , ఇద్దరికీ
శ్రీవారి దర్శనము , తిరుమల
- శ్రీవారి దర్శన సమయము: మధ్యాహ్నం, ౩ గంటలకు,
- రుసుము : ఒక్కొక్కరికి, 300 రూపాయలు.
- దర్శన మార్గము: వైకుంఠం కాంప్లెక్స్ - 2
గమనిక: శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ పొందుటకు, హోమము కు, హాజరైన టికెట్ చూపించాలి.
No comments:
Post a Comment