Saturday, January 23, 2021

7 Sisters Temple, Goddess of the Tirumala Forests

        ఏడుగురు అక్కాచెల్లెళ్లు, వన దేవతల  దేవాలయం, తిరుమల              


తిరుమల అరణ్యం ను , వన దేవతలు, రాత్రి, పగలు కాపలా కాస్తారు , దుష్ట శక్తుల నుండి కాపాడుతారు.
"వన దేవతలు- ఏడుగురు అక్కాచెల్లెళ్లు" దేవాలయం, తిరుమల నుండి దిగి వచ్చే రహదారిలో ఉంటుంది. ఈ దేవాలయానికి, ద్వారాలు ఉండవు.
ఏడు మందీ అక్కాచెల్లెళ్లు. వీరు.. పెద్ద గంగమ్మ, అంకాళమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, మాతమ్మ, నేరేళమ్మ, చిన్న గంగమ్మ. అందరిలోకీ చిన్నదైన చిన్న గంగమ్మనే గంగమ్మ అంటారు. తిరుమల ఆలయం నుంచి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు, చీరలు, గంప, చేటలు గంగమ్మకు పంపిస్తుంటారు.
7 Sisters Temple, Goddess of the Tirumala Forests
Goddess of the Tirumala forests& worthy of worship for being the guardian deity of sacred sanctuaries, woodlands, and jungles. Forests are considered to be the home of female energy/Goddess Shakti.

Vimana Venkateswara Swamy

 విమాన వేంకటేశ్వరస్వామి, తిరుమల

ఆనందనిలయం మీద, ఉత్తర దిశగా పైన ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహం, విమాన వేంకటేశ్వరస్వామి గా పిలుస్తారు .

వ్యాసరాయలు, శ్రీవారి అర్చకత్వాన్ని మధ్వ సాధువు, గురువు: విజయనగర చక్రవర్తిగా నరసింహరాయలు, పరిపాలన కాలములో   "వ్యాసరాయలు" పన్నెండేళ్ళ పాటు అర్చకుడి గా, నిర్వహించాడు.  వ్యాసరాయలు ఆనందనిలయం విమానంపై ఉన్న వేంకటేశ్వరుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠచేసి , దాన్నే విమాన వేంకటేశ్వరుడిగా ప్రచారానికి తీసుకువచ్చాడు.

తొండమాన్ చక్రవర్తి : ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని "వేంకటాచలమాహాత్మ్యం" ద్వారా తెలుస్తోంది.

పూర్వ  విమాన ప్రదక్షిణం ఆచారము: పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా "విమాన వేంకటేశ్వరస్వామి"వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట.పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించడం జరుగుతూ ఉంది.

విశ్వాసం: ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాణ్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం. దర్శనం కాకుండా వెళ్ళిపోవాల్సి వచ్చినవారు ,ఆ రోజుల్లో విమాన వేంకటేశ్వరుడిని దర్శించి తిరిగివెళ్ళేవారు. ఒకవేళ ఆనందనిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వేంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట.

విమాన ప్రదక్షిణం:  వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వెళ్తూ, విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ.

 ఫలితము:  ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలగుతాయి అంతేకాదు సర్వశుభాలు కలుగుతాయట.

నూతన వధూవరులకు " తిరుమల వివాహ కానుక "

 నూతన  వధూవరులకు " తిరుమల వివాహ కానుక "                                    తిరుమల వివాహ కానుక  - ఇది పూర్తిగా ఉచితం             మ...