శ్రీవారి ”భాగ్ సవారి” ఉత్సవం" ”భాగ్ సవారి” అంటే , శ్రీవారు "తోటకు వేంచేయుట" అని అర్ధము . బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు, ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం, ఆనవాయితీ.
శ్రీవారు , అపసవ్య దిశ లో , అనంతాళ్వారు తోటకు వచ్చుట: భాగ్ సవారి” ఉత్సవం సందర్భముగా శ్రీవారు , అపసవ్య దిశలో , అనంతాళ్వార్ తోట కు వస్తారు. ప్రతి రోజు, సాయంత్రం 6 గంటలకు , స్వామి వారు , సవ్య దిశలో, మాడ వీధులలో భక్తులకు దర్శనము ఇస్తారు, ”భాగ్ సవారి” ఉత్సవం, రోజున, స్వామివారు , అపసవ్య దిశలో వస్తారు.
అనంతాళ్వారు, " శ్రీదేవిని , అశ్వత్త వృక్షానికి బంధించుట" : శ్రీవారు , శ్రీ అనంతాళ్వారు భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా, అనంతాళ్వారు పూల తోటకు, మానవ రూపంలో వచ్చారు . అనంతాళ్వారు పూల తోటలో, పూలు కోస్తున్న అమ్మవారిని, అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా, అపసవ్య ( అప్రదక్షణ) దిశలో పారిపోయి, ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.
శ్రీవారికి , మామ గారైన అనంతాళ్వారు: ఆలయంలో , స్వామి వారు , పూజారులకు , భక్తులకు " అనంతాళ్వారు, తోటలో అమ్మవారిని బందించాడని చెపుతారు . పూజారులు , భక్తులు మేళతాళలతో తోటకు చేరుకుంటారు. అనంతాళ్వారు, అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. అనంతాళ్వారు, "పూల బుట్టలో, అమ్మవారిని", తీసుకురావటం, చూసి , శ్రీవారు , "అనంతాళ్వారు ను మామ " అని పిలిచారు .
శ్రీవారు , " భాగ్ సవారి" కి అభయమిచ్చుట: అనంతాళ్వారు భక్తికి మెచ్చి స్వామివారు , అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాలు మరునాడు, తాను అనంతాళ్వారు తోటలోనికి అప్రదక్షణం గా విచ్చేసి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చారు.
నాళాయరా దివ్య ప్రబంధం: అనంతాళ్వారు తోటలో, అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వహిస్తారు . ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీ చిన్నజీయర్‌స్వామి, పేష్కార్, పార్ఫతేదార్, శ్రీవారి భక్తులు పాల్గొంటారు.
”భాగ్‌సవారి” ఉత్సవం: ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే, ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం, స్వామివారు సాయంత్రం 4.30 గంటలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగుస్తుంది.
అనంతాళ్వారు తోట ( పురుశైవారి తోట), శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉంటుంది.